వైసిపి అరాచక ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ఓ ప్రకటనలో మాట్లాడుతూ.
బాపట్ల:- వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో ఆదాయం పెరగలేదు ఉద్యోగాలు రాలేదు, మాయమాటలతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాదుడే బాదుడు అంటూ ప్రజలను పిండేస్తున్నారు.
చెత్త మీద పన్ను వేసి చెత్త ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో మిగిలిపోయారు అన్నారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో ఏనాడు కూడా కరెంటు చార్జీలు పెంచలేదు అని అన్నారు.
200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు.
ఆర్టీసీ బస్సు చార్జీలు, కరెంటు చార్జీలు, నిత్యవసర సరుకుల ధరలను పెంచి ప్రజలను కుని చేస్తున్నారన్నారు.
చంద్రన్న హయాంలో ఉన్న సంక్రాంతి కానుక క్రిస్మస్ గిఫ్ట్ రంజాన్ తోఫా ఏమయ్యాయి అని ప్రశ్నించారు.
పంట కాలువలలో నీరు బదులుగా రైతుల కన్నీరు పారుతుంది అని అన్నారు
నీరు లేక పంట పండక ఇతర గ్రామాలకు వలసలు వెళ్లి బ్రతకా వలసి వస్తుంది
కబ్జా చేసిన వారికే న్యాయం చేసే ఈ ప్రభుత్వంలో భూ రక్షణ చట్టం అమల్లోకి వస్తే మీ భూములన్ని కూడా గోవిందా…. గోవిందా….
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ రక్షణ చట్టాన్ని రద్దు చేస్తామని అన్నారు
వైసిపి ప్రభుత్వం లో నష్టపోయింది బడుగు బలహీన వర్గాలే
నా ఎస్టీలు నా ఎస్సీ లు నా బీసీలు నామైనారిటీలు అంటూ దళితులపైనే దాడులు చేస్తున్న అరాచక ప్రభుత్వం ఈ వైసిపి ప్రభుత్వం
వైసిపి నేతల దాడులతో ఎంతోమంది ఎస్సీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
29 మంది దళిత ఎమ్మెల్యేలను బదిలీ చేశారు
తన చెల్లికే న్యాయం చేయలేని వాడు రాష్ట్ర ప్రజలకు ఇంకేం న్యాయం చేస్తాడు,విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనార్హులు
మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారు,మూడు రాజధానులన్న ముచ్చటే కానీ ఒక్క ఇటుక అయినా పేర్చింది లేదు.
రాబోయే కాలంలో తల్లికి వందనం ద్వారా టీడీపీ, జనసేన ప్రభుత్వం కుటుంబంలోని పాఠశాలకు పంపుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 ఇస్తుంది.
దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు యువగళం నిధి కింద నెలకు రూ.3 వేలు ఇచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.
రక్షిత నీటి పథకం ద్వారా శుద్ధి చేసిన కుళాయి నీటిని అమలు చేస్తాము.
పేదలను సంపన్నులను చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను పరిష్కరిస్తాం అనీ అన్నరు.