దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 27, త్రినేత్రం న్యూస్. దేవరకొండ లో సురక్షిత ప్రయాణం అవగాహన కార్యక్రమంలో భాగంగా సీఐ వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ. డ్రైవర్లు వాహనం నడిపేటప్పుడు ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని అన్నారు. ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా డ్రైవింగ్ లో జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు.
రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని అన్నారు. మద్యం సేవించి, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని అన్నారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీమాట్లాడుతూ..ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని, డ్రైవింగ్లో నిర్లక్ష్యం పనికిరాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై సలాకమ్మ, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ రాజకుమార్ రెడ్డి, రవీంద్ర భారతి స్కూల్ రామకృష్ణ, బచ్పన్ స్కూల్ జి జంగయ్య, అన్వర్, శ్రీధర్, భాస్కర్, రాము, స్కూల్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


