MLA Nenavath Balu Naik : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ మే 07 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణ కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 332వ ఆరాధన మరియు దేవాలయ 12వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకొని, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్. అనంతరం ఎమ్మెల్యే ని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు.

ఆ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ దేవరకొండ నియోజక వర్గ ప్రాంత ప్రజలపై ఉండి, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే స్వామి వారిని ప్రార్థించడం జరిగింది. దేవరకొండ పట్టణంలో 50కోట్ల రూపాయలతో ప్రతి వాడలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో తీసుకోవస్తా అని అన్నారు.

దేవరకొండ నియోజక వర్గంలో ఉన్న రైతాంగానికి ప్రతి సెంటుగుంటకు సాగు నీరు అందిస్తా. అనంతరం ఆలయ అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేస్తా అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, PACs చైర్మన్ కొండ్ర శ్రీశైలం యాదవ్, మాజీ పట్టణ సర్పంచ్ పున్న వేంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, మాజీ కౌన్సిలర్ జయ ప్రకాష్, మాజీ ఎంపీటీసీ నారాయణ,యువ నాయకులు సుభాష్ నాయక్, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Nenavath Balu

You cannot copy content of this page

Scroll to Top