Nenavath Balu Naik : శ్రీ వాసవి మాత అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్

TRINETHRAM NEWS

దేవర కొండ మే 07 త్రినేత్రం న్యూస్ : శ్రీ వాసవి మాత జయంతి సందర్భంగా నేడు దేవరకొండ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన వాసవి మాత అభిషేకం కార్యక్రమంలో పాల్గొని,అమ్మవారిని దర్శించుకొని, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ .

అనంతరం ఎమ్మెల్యే ని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. దేవరకొండ నియోజక వర్గ ప్రాంత ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే అమ్మవారిని ప్రార్ధించడం జరిగింది. అనంతరం కాలనిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, PACs చైర్మన్లు,యూత్ కాంగ్రెస్ నాయకులు, వైశ్య సంఘం నాయకులు,NSUI నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Nenavath Balu

You cannot copy content of this page

Scroll to Top