త్రినేత్రం న్యూస్ వరంగల్ జిల్లా ప్రతినిధి.. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో గల ఎమ్.ఎస్. నగర్ లో నమోదైన డెంగ్యూ పాజిటివ్ కేసు ఇంటిని జిల్లా మలేరియా అధికారి రజిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
డెంగ్యూ వ్యాధిగ్రస్తుడు హర్ష ను ఆరోగ్య వివరాలు తెలుసుకుని, డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి నిరోధక చర్యల గురించి తెలియజేశారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఉండటానికి నీటి నిలువలను తొలగించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని,ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ భరత్, ఆరోగ్య విస్తరణ అధికారులు విజయేంద్ర కుమార్, సదానందం, పబ్లిక్ హెల్త్ మేనేజర్ జన్ను కోర్నెలు , స్థానిక ఏ.ఎన్.ఎం. శోభ , ఆశ కార్యకర్త , మున్సిపల్ సానిటరీ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


