ASHA Meetings : ఆశ సమావేశాలలో కీటక జనిత వ్యాధుల పై అవగాహన కల్పించిన డి. ఎం. ఎచ్.ఓ. డా.వాణి

TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రాగినేడు మరియు గర్రెపల్లి యందు జరిగిన ఆశ సమావేశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి. వాణి పాల్గొన్నారు. ఈ నెల ఆశ సమావేశ టాపిక్ అయిన కీటక జనిత వ్యాధుల పై అవగాహన కల్పించారు.

ప్రతి శుక్ర వారం డ్రై డే పాటించాలని, ఆశలు కనీసం 30 గృహాలు సందర్శించి దోమ లార్వా పెరుగుదల నిలువలను గుర్తించాలి, వాటిని తొలిగించుటకు అవగాహన కల్పించాలి అని అన్నారు. తొలిగించటకు వీలుగాని, వాడని నీటి నిల్వల యందు ఆయిల్ బాల్స్ వేయాలని సూచించారు. జ్వరాల సర్వే నిర్వర్తించాలని అన్నారు గర్భిణీ స్త్రీలను 3 నెలల లోపూ నమోదు చేయాలని, వారికి మొదటి రెండు పరీక్షలు ఆరోగ్య కేంద్రాల యందు మరియు 3,4 వ పరీక్షలు దగ్గరలోని కమ్యూనిటీ ఆసుపత్రి లేదా ప్రసూతి ఆసుపత్రుల యందు చేయించాలి అని, అందుకు రవాణా కొరకు102 వాహనం సేవలు వినియోగించు కోవాలి అని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల యందు ప్రసవం లను పెంచాలి అని అన్నారు ఎన్.సి.డీ స్క్రీనింగ్ నిర్వహించాలి, ప్రతి క్షయ వ్యాధి గ్రస్తులను మందులను సక్రమంగా వాడేవిదంగా చూడాలని అన్నారు. తగ్గని దగ్గు, జ్వరం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉన్న వారికి తెమడ పరీక్షలు చేయించాలి అని అన్నారు. ఆశలు సేవ దృక్పథం తో ఆరోగ్య సేవలు అందించాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డా.ఆర్.రాజమౌళి, డా. బి. శ్రీరాములు, డా. కె. వి. సుధాకర్ రెడ్డి, వైద్యాధికారులు డా.శ్రవణ్ కుమార్, డా. ఉదయ్, ఆశ నోడల్ సూపర్వైజర్ లు, ఎ . ఎన్.ఎం.లు మరియు ఆశలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

awareness on insect-borne diseases in ASHA meetings

You cannot copy content of this page

Scroll to Top