Cyclone Montha : మొంథా తుఫాన్ బీభత్సం

TRINETHRAM NEWS

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.
ప్రాజెక్టుకి పెరిగిన వరద ,
అలుగు ఉదృతిగా పారుతుండడంతో రహదారిపై నిలిచిన వాహనాలు.
ప్రమాదాలు జరగకుండా వాహనాలను వెనక్కి పంపిన పోలీసులు.
డిండి(గుండ్లపల్లి) అక్టోబర్ 29 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ప్రాజెక్టు లోకి వరద ఎక్కువగా వస్తుండడంతో తుఫాన్ కారణంగా ఎగువన కురుస్తున్న వర్షాలకు దుందుభి వాగు పరవళ్ళు తొక్కుతుంది. ప్రాజెక్టులోకి వద్ద నీరు ప్రవాహం పెరిగి కింద ఉన్న అలుగు ఎక్కువగా వస్తుండటంతో నీటి ఉధృతికి రోడ్డు పక్కన ఉన్న చిన్నబ్రిడ్జి డ్యామేజీ అయ్యింది.
వరద ఎక్కువగా వస్తుండడంతో రోడ్డుపై నుండి నీరు ప్రవహిస్తుండడంతో ముందస్తు చర్యలుగా ప్రమాదాలు జరగకుండా డిండి పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాల కృష్ణ మరియు సిబ్బంది తో కలిసి వాహనాలను వెనక్కి తిప్పి పంపించారు. జాతీయ రహదారి ఎన్ హెచ్ 765 పై చాలా వాహనాలు నిలిచిపోయాయి కొన్నిచోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించడం వలన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది .వర్షాల కారణంగా కొన్నిచోట్ల చెట్లు విరిగి దారికి అడ్డంగా పడిపోయినాయి. అలుగు ఉదృతి ఎక్కువగా అవడం వలన ఎన్ హేచ్765 జాతీయ రహదారిపై రాకపోకలను పోలీసు వారు బందు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cyclone Montha

You cannot copy content of this page

Scroll to Top