జూలై 26, 2026
TRINETHRAM NEWS
Cyberabad Police Serving

Cyberabad Police : త్రినేత్రం న్యూస్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈరోజు కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్లపై ప్రత్యేకంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు, నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ, వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నారు.

వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా సూచనలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన అందించేందుకు అన్ని పోలీసు యంత్రాంగాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.

ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page