WhatsApp Image 2024 01 15 at 12.34.02 PM
Trinethram News : రాజన్న జిల్లా : జనవరి15
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు.
సంక్రాంతి పండుగ వరుస సెలవులు కారణంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆల యానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసి పోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారు లు గర్భాలయంలో ఆర్జిత సేవలు భక్తులకు అందజేస్తు న్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ధర్మగుం డంలో పుణ్యస్నానాలు ఆచరించిన స్వామివారికి కోడే మొక్కలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటు న్నారు.
ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
