సెప్టెంబర్ 9, 2026
TRINETHRAM NEWS
Creating Awareness

Creating Awareness : డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందున, రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో, తక్కువ కాలంలో చేతికి వచ్చే స్వల్పకాలిక పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి.. తేమ ఒత్తిడి తో వాడి పోతున్న పంటలకు 2% యూరియా ద్రావణం లేదా నీటిలో కరిగే 19:19:19 లేదా 13:0:45 ఎరువులను పంట అవసరాన్ని బట్టి సిఫార్సు చేసిన మోతాదులో పిచికారీ చేసుకోవాలని తెలిపారు.

పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఎసిటామిప్రిడ్ 0.5 గ్రాములు లీటరు నీటికి చొప్పున వీటిలో ఏదో ఒక మందును పిచికారీ చేసుకోవాలని,

అలాగే, ప్రభుత్వం ప్రకటించిన సన్న వడ్ల బోనస్ పొందేందుకు అర్హులైన రైతులు తమ సన్న వడ్ల పంట వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియకు రేపు చివరి తేదీ కావడంతో అర్హులైన రైతులు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.

రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటల వైవిధ్యీకరణను చేపట్టి, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయఅధికారి రెహానా సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page