సెప్టెంబర్ 9, 2026
TRINETHRAM NEWS
Free Medical Camp

కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు

  • ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి
  • ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తీదేడు సర్పంచ్.

Free Medical Camp : చింత పల్లి సెప్టెంబర్ 09 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తీదేడు గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కామినేని హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో గురువారం గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తెలిపారు.
ఈ హెల్త్ క్యాంపులో వైద్య నిపుణులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించనున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ప్రతి ఒక్కరూ హెల్త్ క్యాంపుకు హాజరై తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని, గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఆమె పెర్కోన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page