రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం మండలు టిఎన్జీవో సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం ఎన్ టి పి సి లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా టి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ హాజరై నూతన శాఖ కార్యవర్గం అధ్యక్షులు డి జగన్, కార్యదర్శి పి కృష్ణ, కోశాధికారి డి రవితేజ మరియు ఇతర కార్యవర్గం చే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొంకురి శంకర్ మాట్లాడుతూ.. సంఘం బలోపేతానికి ఉద్యోగులు కలసికట్టుగా పని చేయాలని అన్నారు.
సమస్యల పరిష్కారానికి జిల్లా సంఘం రాష్ట్ర సంఘం ఇచ్చే ఆదేశాలతో పనిచేయాలని రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల ప్రధాన సమస్య సి పి ఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలి. ఈ సందర్భంగా బొంకూర్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల సాధనకు టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో చేసే ఎలాంటి పోరాటాల కైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి సత్యనారాయణ, సందీప్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కొమురయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


