CPM Protests : రేణిగుంట శెట్టిపల్లి ఎస్. బి ఐ. బ్యాంకు రహదారిపై గుళ్లను తొలగించాలని సిపిఎం నిరసన

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 25: తిరుపతి జిల్లా: రేణిగుంట… తిరుపతి జిల్లా రేణిగుంట మండలం శెట్టిపల్లి ఎస్. బి ఐ. బ్యాంకు రహదారి డివైడర్ పక్కన పడి ఉన్న కంకర గుల్ల వలన ఆదివారం ఉదయం స్కూటర్లో వెళ్తూ క్రిందపడి ముఖానికి ఖాయం అయిందని, అదేవిధంగా మంగళవారం రాత్రి కూడా ఇటువంటి ఘటన జరిగిందని..

గుల్ల రోడ్డుపై పడి నాలుగు రోజులు అవుతున్న సంబంధిత అధికారులు, పోలీసులు, పంచాయతీ సిబ్బంది లేదా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నాయకత్వం గానీ, గుల్ల తొలగించే ప్రయత్నం చేయకపోవడంతో బుధవారం ఉదయం 7:30 నిమిషాలకు రేణిగుంట సిపిఎం పార్టీ నాయకత్వం కలిసి శెట్టిపల్లి ఎస్బిఐ బ్యాంక్ రోడ్డు డివైడర్ పైన నిలబడి సిపిఎం జండాలుతో ,నిరసన ధర్నా,చేపట్టడం జరిగింది.

అనంతరం తట్టా,పార పట్టుకొని శ్రమదానం ద్వారా గుళ్లను తొలగించే ప్రయత్నం కొంత మేర చేశారు. మహిళలు చీపురు కట్టలు పట్టుకొని రోడ్డుపై పడి ఉన్న గుళ్లను తొలగించారు. వెంటనే అధికారులు స్పందించి మిగతా గుళ్లను ఈరోజు సాయంత్రం లోపల తొలగించాలని.. యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు చేపట్టాలని రేణిగుంట సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కె. ఈశ్వరమ్మ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, ఎంపీలు రోడ్డు మీద కార్లు వస్తున్నాయంటే రోడ్లన్నీ పంచాయతీ సిబ్బంది ద్వారా శుభ్రం చేస్తారని అయితే ఈ రోడ్డుపైన పడిన గుళ్లను తొలగించాలన్న ఆలోచన అధికారులకు కలగలేదా అని విమర్శించారు.

ఈ రహదారి తిరుపతి నుండి రేణిగుంటకు వచ్చే ప్రయాణికులకు, ఎస్టేట్ పరిశ్రమ కార్మికులకు యమగండం గా ఉందని అన్నారు. స్కూటర్లో వెళ్లే వారు క్రిందపడి చనిపోయేంతవరకు ఇది సమస్యగా మీ కళ్ళకు కనిపించదా అని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను సూటిగా ప్రశ్నించారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CPM protests to remove stones on Renigunta

You cannot copy content of this page

Scroll to Top