CPM : కామ్రేడ్ అచ్యుతానందన్‌కు అరకు వ్యాలీలో సిపిఎం నివాళి

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ జూలై 23 : కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ (101)కు అరకు వేలి ఆదివాసి గిరిజన సంఘం కార్యాలయంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, అచ్యుతానందన్ కమ్యూనిస్టు సిద్ధాంతానికి నిబద్ధంగా, మచ్చలేని రాజకీయ జీవితం గడిపారని పేర్కొన్నారు. ప్రజాపోరాటం కోసం ఎమర్జెన్సీ కాలంలో ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్న ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ప్రస్తుత మతోన్మాద పరిస్థితుల్లో అచ్యుతానందన్ పోరాట స్ఫూర్తితో గిరిజనుల హక్కుల కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి కిండంగి రామారావు, నాయకులు పాంగి రామన్న, పి. బాలకృష్ణ, ఎస్. ఐషు బాబు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CPM pays tribute to

You cannot copy content of this page

Scroll to Top