గిరిజనుల హక్కుల కోసం జూలై 28న గాంధీభవన్ ముట్టడికి పిలుపు

TRINETHRAM NEWS

-బాబురామ్ నాయక్.
దేవరకొండ జులై 22 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో లంబాడి-బంజారా గిరిజన వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురామ్ నాయక్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 40 నుంచి 50 లక్షల బంజారా జనాభా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది గిరిజన సమాజంపై జరిగిన తీవ్ర అన్యాయం మరియు రాజకీయ అవహేళన అని ఆయన ఆరోపించారు.
ఈ వర్గం గిరిజనులుగా గుర్తింపుచెందినప్పటికీ, వారిని శాసన, కార్యనిర్వాహక స్థాయిలలో భాగస్వామ్యం చేయకుండా, దూరం పెట్టే ప్రభుత్వ వైఖరిని తిప్పికొట్టాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. బంజారాలకు మంత్రి పదవి కేవలం ఓ అభిలాష కాదు, అది ప్రాథమిక రాజ్యాంగ హక్కు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లంబాడి గిరిజనుల హక్కుల సాధన కోసం ఈ నెల 28న గాంధీభవన్ వద్ద గిరిజన ముట్టడి నిర్వహించనున్నట్టు తెలిపా ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది గిరిజనులు హాజరయ్యే అవకాశం ఉందని, ఇది న్యాయబద్ధమైన రాజకీయ హక్కుల కోసం గిరిజనుల గళం అవుతుందని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రతి బంజారా గిరిజనుడు ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Call to siege Gandhi Bhavan

You cannot copy content of this page

Scroll to Top