WhatsApp Image 2024 12 08 at 20.06.16
పరదేశి పాకలు గ్రామంలో సోలార్ నీటి ట్యాంక్ మరమ్మత్తులు చేపట్టాలి. – సిపిఐ మండల కార్యదర్శి ఇరువాడ దేవుడు.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్ ( కొయ్యూరు మండలం ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, బంగారంపేట పంచాయతీలో గల,పరదేశి పాకలు గ్రామంలో సోలార్ నీటి ట్యాంకు మరమ్మత్తులు చేపట్టాలి. సిపిఐ మండల కార్యదర్శి ఇరువాడ దేవుడు. పరదేశిపాకలు గ్రామంలో సోలార్ నీటి ట్యాంక్ మరమ్మత్తులు గురై మంచినీటికి, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్న ఏ ఒక్కరు స్పందించకపోవడం దారుణమని, భారత కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి, ఇరువాడ దేవుడు తెలిపారు. ఆదివారం విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో సిపిఐ కార్యదర్శి ఇరువాడ దేవుడు మాట్లాడుతూ, పరదేశీపాకలు గ్రామంలో గల సోలార్ మంచినీటి ట్యాంకు మరమ్మత్తులకు గురై,ఆరు నెలల అవుతున్న పంచాయతీ కార్యదర్శి గాని,సర్పంచ్ గాని స్పందించడం లేదని, గ్రామస్తులు తెలిపినట్లు దేవుడు అన్నారు. ఆరు నెలల నుండి మంచినీటి కొరత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న, సమస్య పరిష్కరించడంలో ఆలసత్వం ఎందుకు చేపడుతున్నారు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు స్పందించి సోలార్ మంచినీటి ట్యాంకులు మరమ్మత్తులు చేపట్టి గ్రామస్తులకు నీటి కష్టాలు తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే మండల అభివృద్ధి కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపడుతామని ఇరువాడ దేముడు ఈ సందర్భంగా మీడియా ముందు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
