కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 12 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని దత్తత్రయ కాలనీ సాయిబాబా టెంపుల్ వద్ద నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా అంచుల వద్ద మట్టి వేయాలని, మంచిగా క్యూరింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, బ్రహ్మానంద గౌడ్, పి.ఎల్ ప్రసాద్, పోశెట్టిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


