కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 12 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడా ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్లు మరియు పాఠ్య పుస్తకాలను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారి చేతులమీదుగా పిల్లలకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం అయిన మొదటిరోజునే తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్ అందించడం ఆనందించదగ్గ విషయం అని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న ఈ ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా ప్రభుత్వ పాఠశాల విద్యను మరింత సమర్థవంతంగా అందరికీ అందుబాటులోకి తీసుకువస్తుందని కొనియాడారు.కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, అంజయ్య యాదవ్, జి.గోపాల్, సత్యనారాయణ, సుధాకర్, లక్ష్మీ,.
పాఠశాల సిబ్బంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. నరసింహులు, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సుందర్ రావు, ఏ ఏ పి సి చైర్మన్ లక్ష్మీ, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


