అల్లూరిజిల్లా(అరకువ్యాలీ) త్రినేత్రం న్యూస్, జూన్ 13 : అరకు ప్రాంతంలో మోటారు వాహన చలనం, డ్రైవర్ల హక్కుల పరిరక్షణకు ఎనలేని సేవలందించిన ట్రాన్స్‌పోర్ట్ శాఖ అధికారులకు శ్రీ వాయుపుత్ర మోటార్ యూనియన్ ఘనంగా సన్మానం చేసింది. గురువారం ఉదయం 10 గంటలకు అరకు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇటీవల ట్రాన్స్ఫర్ అయిన ఆర్టీవో లీలా ప్రసాద్, మరియు బ్రేక్ ఇన్‌స్పెక్టర్ వాసు, కి ఘన సన్మానం నిర్వహించబడింది.
సన్మాన కార్యక్రమం అరకు అక్షయ ఇన్ ప్రాంగణంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షుడు కొర్ర మహేష్, మాజీ అధ్యక్షులు నాగార్జున, మోస్య రాజయ్య, సభ్యులు సత్తిబాబు, గిరి, కిరణ్, చంద్రశేఖర్, షరీఫ్, అనిల్ తదితరులు హాజరై, తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ –
“శ్రమికుల హక్కుల పరిరక్షణలో వీరి మద్దతు అపూర్వం. మోటారు డ్రైవర్ల సమస్యలను నిస్సహాయంగా గమనించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో వీరు చూపిన నిబద్ధత, సహకారం మాకు ఎంతో ప్రోత్సాహకరం,” అని పేర్కొన్నారు.
ప్రతిభా గల, సామాజిక స్పృహ కలిగిన అధికారులు ఎప్పుడు ఏ ప్రాంతానికైనా అవసరమేనని యూనియన్ సభ్యులు అన్నారు. వీరి సేవలు మర్చిపోలేనివని పేర్కొంటూ, శాలువాలతో సత్కరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


