Dodla Venkatesh Goud : జయశంకర్ కాలనీ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 10 : 124 డివిజన్ ఆల్విన్ కాలనీ ఎల్లమ్మబండ పరిధిలోని జయశంకర్ కాలనీ లో డ్రైనేజ్ మరియు రోడ్లకు సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జయశంకర్ కాలనీ లో పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జయశంకర్ కాలనీ లో ఇటీవలే డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని కాబట్టి సీసీ రోడ్డు త్వరలో మంజూరు చేసి నిర్మిస్తామని అన్నారు.

కాలనీ లో కొన్ని బ్లాక్ లకు త్రాగు నీరు ప్రెజర్ రావడం లేదని కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి కాలనీ లోని త్రాగు నీటి సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో మహేష్, పోశెట్టిగౌడ్, మల్లేష్, ఫారూఖ్, బాబురావు, బాగులు, మోజెస్, బాలకృష్ణ, సలీమ్, రాజమని తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Corporator Dodla Venkatesh Goud

You cannot copy content of this page

Scroll to Top