జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 05 at 6.05.09 PM

TRINETHRAM NEWS

Trinethram News : దేశంలో కరోనా మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

గడిచిన 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా కొత్తగా 761 కొవిడ్‌-19 కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది.

అయితే, యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,423 నుంచి 4,334కి తగ్గినట్లు తెలిపింది.

కేరళలో 1,249 క్రియాశీల కేసులు ఉండగా.. కర్ణాటకలో 1,240, మహారాష్ట్రలో 914, తమిళనాడులో 190, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లో 128 చొప్పున ఉన్నాయి.

తాజాగా కేరళలో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం వెల్లడించింది.

You cannot copy content of this page