Congress Wins : దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే బాలు నాయక్, డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత లకు సత్కారం.

దేవరకొండ: ఫిబ్రవరి 13 , త్రినేత్రం న్యూస్. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దేవరకొండ మున్సిపాలిటీలో అధిక స్థానాలను సాధించి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత మరియు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ.., దేవరకొండ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసమే ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బాలునాయక్ సమర్థ నాయకత్వం, పట్టణ అభివృద్ధిపై చూపిన కట్టుబాటు, ప్రజల సమస్యల పరిష్కారంలో చూపిన చురుకుదనం వల్లే పార్టీకి ఘన విజయం సాధ్యమైందని అన్నారు.

ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ.., ఈ విజయం దేవరకొండ ప్రజలదేనని, ప్రతి కార్యకర్త శ్రమ ఫలితమని తెలిపారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారదర్శక పరిపాలన కోసం మరింత కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, యువజననాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress wins big in Devarakonda Municipality

You cannot copy content of this page

Scroll to Top