Machar Jyoti’s Campaign : ధర్మసాగర్‌లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మాచర్ల జ్యోతి ప్రచారం హోరాహోరీ

TRINETHRAM NEWS

హనుమకొండ, డిసెంబర్ 9 త్రినేత్రం న్యూస్:హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థ మాచర్ల జ్యోతి- ఏలీయా సీనియర్ నాయకులు మరియు స్థానిక కార్యకర్తలతో కలిసి ఈరోజు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు
గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎన్నికల్లో తమను గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వ మరియు ఎం ఎల్ ఏ కడియం శ్రీహరి సహకారంతో నేరుగా నిధులు తీసుకువచ్చి ధర్మసాగర్‌ను ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు తాగునీరు పారిశుధ్యం రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగుపరుస్తానని పేర్కొన్నారు బాట్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ తమ అభ్యర్థికి కేటాయించిన బాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుఱ్ఱపు ప్రసాద్ మాట్లాడుతు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలంటే అధికార పార్టీ అభ్యర్థి తోనే సాధ్యమవుతుంది అని వెయ్యి ఓట్ల మెజారిటీతో మాచర్ల జ్యోతి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ ప్రచార కార్యక్రమం లొ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుఱ్ఱపు ప్రసాద్ మాజీ జడ్పీటీసీ బొడ్డు వాసు దేవ్ ధర్మసాగర్ గ్రామ అధ్యక్షులు జాలిగాపు దుర్గయ్య సీనియర్ నాయకులు కొలిపాక రమేష్ కునూరు రాజు మార్కెట్ డైరెక్టర్ బొడ్డు ప్రదీప్ కుమార్ మాజీ ఎంపీటీసీ రొండి రాజు నాగవెల్లి ప్రశాంత్ సంబరాజు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు స్థానిక యువకులు మహిళా సంఘాల సభ్యులు కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress sarpanch candidate Machar Jyoti's campaign

You cannot copy content of this page

Scroll to Top