MLA Vivekananda : కరాటే విభాగంలో డిస్ట్రిక్ట్ స్థాయికి అర్హత సాధించిన అశోక్ మెమోరియల్ హై స్కూల్ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే వివేకానంద

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇటీవల మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్కూల్ ఛాంపియన్‌షిప్‌‌లో తమ అద్భుత ప్రతిభతో మొత్తం 6 బంగారు, 5 వెండి, 4 కాంస్య పతకాలు సాధించిన అశోక్ మెమోరియల్ ఛాణక్య హై స్కూల్ విద్యార్థులు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలువగా ఆశీస్సులు తీసుకున్నారు. మాస్టర్ ఉదయ్ సార్ అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పిల్లలు విద్యతోపాటు ఆత్మరక్షణ వంటి కళలలో ప్రావీణ్యం పొందినప్పుడు చదువుతోపాటు శారీరకంగా, మానసికంగా స్థైర్యంగా దృఢంగా ఉంటారన్నారు.

ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ క్రీడాకారుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మరియు బంగారు పతక విజేత అయిన మాస్టర్ ఏ. నాగరాజు శిక్షణలో ఉన్న విద్యార్థులు ఈ విజయాలు సాధించడం విశేషం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Vivekananda congratulated the students

You cannot copy content of this page

Scroll to Top