Bandi Ramesh : ఎన్నిక ఏదైనా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాటం

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూలై 1 : ఎన్నిక ఏదైనా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాటం చేయాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు. ఈ నెల 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ సమావేశo విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నిజామాబాద్ లో మంగళవారం పార్టీ నాయకులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జిగా నియమితులైన టిపిసిసి ఉపాధ్యక్షులు రమేష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం హైదరాబాదులో జరగనున్న జైబాపు జై భీమ్ జైసంవిధాన్ కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారన్నారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress party workers are

You cannot copy content of this page

Scroll to Top