త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం.. దమ్మపేట మండలకేంద్రంలో వినాయక ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి సమావేశం నిర్వహించబడింది. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఇంటింటికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చేరవేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రతి ఓటు చాలా విలువైనదని ప్రజల్లో విశ్వాసం పెంచేలా కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ అభిమానులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


