మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నోటీసులు ఇవ్వడం సరికాదు
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ జనవరి 22 త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
గురువారం దేవరకొండ పట్టణంలో పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ……మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నోటీసులు ఇవ్వడం సరికాదు అని ఆయన అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు కేసులు బనాయించి వారికి నోటీసులు ఇచ్చి కక్ష రాజకీయాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రులు కేటీఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు ను ఏమి చేయలేరు అని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ కేసుల పేరుతో ప్రజలను డైవర్షన్ చేసి శునక ఆనందం పొందడానికి మాజీ మంత్రులకు నోటీసులు అని,ఈ నోటీసులలో పస లేదు అని వీటితోని ఏమీ కాదు అని వీటి ద్వారా మాజీ మంత్రి కేటీఆర్ ని ఏమి చేయలేరు అని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


