మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి
పెద్దపల్లి ఎమ్మెల్యే
పెద్దపల్లి మార్చి-10//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని నందన గార్డెన్స్ లో ఉమెన్ డెవలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేర్ విభాగం వారి ఆధ్వర్యంలో మహిళల పురోగతి చర్యను వేగవంతం చేయడం అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని తెలియజేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం రోజున ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మెప్మా ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పథకం అశ్ర ఎస్.ఎల్.ఎఫ్ శ్రీనిధి లోన్ ద్వార ₹3,00,000 /- లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మొబైల్ టిఫిన్ సెంటర్ ప్రారంభించి మహిళా దినోత్సవం సందర్భంగా ముందస్తుగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలలో గెలుపొందిన మహిళామణులకు బహుమతులను అందజేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రతి రంగంలో మహిళలను గౌరవించడం జరుగుతుందని రాజకీయాల్లో కూడా మహిళలకు సముచిత రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని అన్నారు. మహిళను కోటీశ్వరులను చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ పని చేస్తుంది అని గుర్తు చేశారు. అనంతరం 141 సంఘాలకు గాను ₹19,58,50,000/- రూపాయల చెక్కును మహిళలకు అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ మహిళలకు మరియు మెప్మా మహిళలకు జరిగినటువంటి ఆటల పోటీల గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రధానం చేశారు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే సందర్శించడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు డి.ఆర్.డి.వొ కలందిని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ సంక్షేమ శాఖ అధికారులు, పెద్దపల్లి మరియు సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, ప్రకాష్ రావు మున్సిపల్ ఏఈ సతీష్, వినయ్, అకౌంటెంట్ నాగవేణి మరియు మున్సిపల్ సిబ్బంది, మెప్మా మహిళలు, కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


