తేదీ : 23/01/2025.
గ్రామసభ లో గందరగోళం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🙁 త్రినేత్రం న్యూస్).
తెలంగాణ రాష్ట్రం, అశ్వరావుపేట నియోజకవర్గం, మండల కేంద్రంలో ఉన్న నారాయణపురంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు , ఇండ్లకు సంబంధించి గత ప్రభుత్వంలో దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం మళ్లీ భూములు మరియు ఇండ్లు , రేషన్ కార్డులు ఉన్నవాళ్ల పేర్లు ఎక్కువ మంది కి రావడం వల్ల సభలో గందరగోళం ఏర్పడింది. అర్హుల్లో తక్కువ మందికి రావడం జరిగింది. ప్రభుత్వం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది.
వారికి పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మండల ఎంపీడీవో, మండల రెవెన్యూ ఆరయ్య గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App