WhatsApp Image 2025 01 23 at 3.36.46 PM
ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి
త్రినేత్రం న్యూస్, ప్రకాశం జిల్లా,కంభం మండలం.
కంభం పట్టణంలోని సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా అలీ భాష మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని గడగడలాడించడమే కాక దేశ ప్రజల మధ్య పరస్పర నమ్మకాన్ని ఐక్యతను పెంపొందించిన గొప్ప జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు.
ఈ ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం భూపని వెంకటనారాయణ,గుండాల ముక్తేశ్వరరావు, ఏనుగుల రవికుమార్, షేక్ షరీఫ్,ఎం శ్రీనివాసరెడ్డి, పివి ఆంజనేయులు, బి అరుణ కుమారి, కే బ్యూల, బి వనజ, జి డేవిడ్ , సిహెచ్ నారాయణ, ఇంటర్మీడియట్ కళాశాల డైరెక్టర్ సిరిగిరి బ్రహ్మం, పాలిశెట్టి నవీన్, ఉప్పు నారాయణ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
