Blood Donation Camps : 3 ప్రదేశాలలో రక్తదాన శిబిరాల నిర్వహణ

TRINETHRAM NEWS

Operation of blood donation camps at 3 places

32 మంది రక్తదాతలు రక్తదానం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్

*ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన డీఎంహెచ్ఓ

పెద్దపల్లి, జూన్ -14: ఇతర న్యూస్ ప్రతినిధి

ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించు కొని జిల్లాలో మూడు చోట్ల ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో 32 మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. ప్రమోద్ కుమార్ తెలిపారు.

శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ ప్రపంచ రక్తదాతల దినోత్సవంను పురస్కరించుకొని ఆరోగ్య శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా పెద్దపెల్లి వారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, రామగుండం సింగరేణి ఆసుపత్రి నందు మూడు చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పెద్దపల్లి నందు 15 మంది , రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు 12 మంది , సింగరేణి ఆసుపత్రి యందు 5 మంది రక్తదానం చేశారని డిఎంహెచ్ఒ తెలిపారు.

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నందు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, ఒకరు రక్తదానం చేయడం ద్వారా మరోకరి ప్రాణాలను కాపాడవచ్చని, ఇది ప్రాణ దానంతో సమానమని,అందుకే యువకులు, విద్యార్థులు స్వచ్చంధంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి (ఎన్.టి.ఇ.పి.), డాక్టర్ కె. వి. సుధాకర్ రెడ్డి, రెడ్ క్రాస్ సోసైటి తరుపున వీరగోని శ్రీనివాస్, డి.వి.వి.ఎస్.మూర్తి , జనరల్ ఆసుపత్రి- రామగుండం నందు ఐ.ఆర్.ఎస్. ప్రతినిధి వల్లు అంజన్ కుమార్, బ్లడ్ బ్యాంక్ ఇంచార్జి సంపత్, ఇతర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Operation of blood donation camps at 3 places

You cannot copy content of this page

Scroll to Top