ప్రజా కళాకారుడు అమరజీవి కామ్రేడ్ జాకబ్

TRINETHRAM NEWS

ప్రజా కళాకారుడు అమరజీవి కామ్రేడ్ జాకబ్

విగ్రహ ప్రతిష్టాపన కోసం సామూహిక శంకుస్థాపన చేసిన నాయకులు.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రజా కళాకారుడు, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ జాతీయ నాయకులు అమరజీవి కామ్రేడ్ జాకబ్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కొరకు సోమవారం న్యూ అశోక్ థియేటర్ ముందు సామూహిక శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహాంకాళి స్వామి, నాయకులు దీటి బాలరాజు, పి.శ్రీనివాస్, సీనియర్ నాయకులు వేల్పుల నారాయణ, ఆర్జీ 2 బ్రాంచి కార్యదర్శి జీగురు రవిందర్, అంబెడ్కర్ సంఘం నాయకులు మైస రాజేశ్, సాంస్కృతిక కళా విభాగం గాయకురాలు ఈదునూరి పద్మ, టిబిజికెఎస్ నాయకులు మాదాసు రాంమూర్తి, సిపిఐ నగర కార్యదర్శి కే.కనకరాజు లు మాట్లాడుతూ జాకబ్ కళా రంగానికి, గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత ప్రజలకు, కార్మిక వర్గానికి చేసిన సాంస్కృతిక సేవలను వారు కొనియాడారు.

జాకబ్ ఈ ప్రాంత కళారంగానికి చేసిన సేవలు గుర్తించి ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం మంచి పరిణామమని వారన్నారు. జాకబ్ విగ్రహం ఏర్పాటు కు రామగుండం నగర పాలక సంస్థ పాలక వర్గాన్ని ఒప్పించి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ, ట్రేడ్ యూనియన్, ప్రజా సంఘాల నాయకులు కళాకారులు ఆరెల్లి పోషం, మాదన మహేష్, గౌతం గోవర్ధన్, కొండ్ర సత్యనారాయణ, దాసరి రామస్వామి, బుర్ర తిరుపతి, ఎం.ఎ. గౌస్ సూర్య, ప్రీతం, సన్నీ మోహిద్, ఖాజా మహ్మద్, జనగామ రాజనర్సు, కనకం శ్యాంసన్, పర్లపెల్లి రవి, పులి మోహన్, దయా నర్సింగ్, మాటేటి శంకర్, బోడకుంట కనకయ్య తో పాటు ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొనగా ఇట్టి కార్యక్రమానికి ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కన్నం లక్ష్మి నారాయణ వందన సమర్పణ చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top