జూలై 17, 2026

WhatsApp Image 2025 01 27 at 16.10.48

TRINETHRAM NEWS

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, జనవరి- 27: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

రామగుండం నగర కార్పొరేషన్ పాలకవర్గం కాలపరిమితి జనవరి 26 ,2025 న ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ పెద్దపల్లి ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్లో రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా రామగుండం ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ , రామగుండం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page