SP Sneha Mehra : మతసామరస్యంతోనే సమాజ ప్రగతి: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు క్రైస్తవ మత పెద్దలతో కలిసి ఎస్పీ క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగ ప్రేమకు, శాంతికి మరియు కరుణకు చిహ్నమని కొనియాడారు. అన్నీ మతాలు సమాజంలో సోదరభావాన్ని, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని తెలిపినారు. పోలీస్ శాఖ అనేది ఒక కుటుంబం వంటిదని, అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తూ ఇలాంటి వేడుకలు జరుపుకోవడం వల్ల సిబ్బందిలో పని ఒత్తిడి తగ్గి, మానసిక ఉల్లాసం మరియు ఐక్యత పెరుగుతుందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. జిల్లా ప్రజలందరూ మతసామరస్యాన్ని పాటిస్తూ పండుగలను ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.

సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలలో పాస్టర్లు రెవెరెండ్ పవన్ , జాన్ గార్లు పాల్గొని జిల్లా పోలీసుల సంక్షేమం కోసం, శాంతి కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.రాములు నాయక్ , డి‌టి‌సి డి‌ఎస్‌పి శ్రీనివాసులు,డి‌టి‌సి డి‌ఎస్‌పి జానయ్య వికారాబాద్ డి‌ఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి , ఏ‌ఓ ఖజామోహినోద్దీన్, సీఐలు, ఆర్.ఐలు మరియు పోలీస్ కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Participated in Christmas celebrations

You cannot copy content of this page

Scroll to Top