త్రాగు నీటి సమస్యతో కార్పొరేటర్ కార్యాలయానికి వచ్చిన కాలనీ మహిళలు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 11 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని గణేష్ నగర్ కాలనీలో మంజీర వాటర్ ప్రెజర్ తక్కువరావడంతో త్రాగు నీటి సమస్యతో ఇబ్బందిపడుతున్నామని కాలనీ లోని మహిళలు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయానికి వచ్చి వారి సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి గణేష్ నగర్ లో త్రాగు నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జల మండలి వారు కాలనీకి వచ్చి సమస్యను పరిశీలించి ప్రెజర్ ఎక్కువ వచ్చేలా చేస్తారని కాలనీ వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, గణేష్ నగర్ కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Colony women come to

You cannot copy content of this page

Scroll to Top