
Electricity Committee Meeting : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 08; జిల్లా కలెక్టరేట్ లో గౌతమీ సమావేశం మందిరంలో జిల్లా విద్యుత్ కమిటీ (డిస్టిక్ ఎలక్ట్రిసిటీ కమ్యూనిటీ) నిర్వహించారు. ఈ సమావేశానికి ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, చింతమనేని ప్రభాకర్, పత్స మట్ల ధర్మరాజు పాల్గొన్నారు.
ఉంగుటూరు నియోజకవర్గంలో విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశం ఇచ్చారు ఎలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జిల్లాలో అమలవుతుందని తెలిపారు. రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్ డి ఎస్ ఎస్) పురోగతి, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ పథకాల అమలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, వినియోగదారుల సమస్యల పరిష్కారం, విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ, భవిష్యత్ అభివృద్ధి కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ, ఉంగుటూరు నియోజకవర్గంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు చేపట్టడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న విద్యుత్ మౌలిక సదుపాయాల పనులను ప్రాధాన్యత ఆధారంగా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ప్రభుత్వం ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వాలంటే ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe