Coaching Centers : ప్రభుత్వ నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లు

TRINETHRAM NEWS

ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడిపిస్తూ విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లు.
నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులు.
హాస్టళ్ల పేరుతో లక్షల ఫీజులు దండుతున్న కోచింగ్ సెంటర్లు.
తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని కోచింగ్ సెంటర్లు మూసివేయాలి.
బిఆర్ఎస్వి దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ.

Trinethram News : దేవరకొండ ఆగష్టు 29 త్రినేత్రం న్యూస్. దేవరకొండ,కొండమల్లెపల్లిలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారని బిఆర్ఎస్వి దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ….. ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేకుండా పేద విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులు అని ఆయన అన్నారు. దేవరకొండ పట్టణంలో సైనిక్,నవోదయ,గురుకుల మరియు ఇతర కోచింగ్ పేరిట హాస్టల్ అని చెప్తూ దాదాపు ఒక విద్యార్థికి లక్ష అరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు.తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని కోచింగ్ సెంటర్లు మూసివేయాలి ఆయన డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Coaching centers

You cannot copy content of this page

Scroll to Top