కో-ఆపరేటివ్ సొసైటీలు రైతులకు మరింత ప్రోత్సాహకరంగా ఉండాలని, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గోరంట్ల కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో ఉన్న తొమ్మిది పి ఏ సి ఎస్ చైర్మన్లు, త్రీమెన్ కమిటీ సభ్యులు, సొసైటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన తొర్రేడు సొసైటీ చైర్మన్ దండమూడి బాపినీడు, కాతేరు సొసైటీ చైర్మన్ నున్న బాబురావు, కొంతమూరు సొసైటీ చైర్మన్ అడ్డాల శ్రీను, హుకుంపేట సొసైటీ చైర్మన్ బొప్పన శ్రీను, రాజవోలు సొసైటీ చైర్మన్ వల్లూరి చెంచురాజు, వేమగిరి సొసైటీ చైర్మన్ వెలుగుబంటి వెంకటాచలం (నాని), కడియపులంక సొసైటీ చైర్మన్ గట్టి నరసయ్య, కడియం సొసైటీ చైర్మన్ వెలుగుబంటి రఘురాం (నాని), మురముండ సొసైటీ చైర్మన్ వట్టికూటి జానకిరామయ్య (దత్తుడు) మరియు త్రీమెన్ కమిటీ సభ్యులందరికీ గోరంట్ల అభినందనలు తెలిపారు.
ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోయాయని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పుడిప్పుడే వ్యవస్థలన్నీ గాడిలో పెడుతున్నారని, ఒకపక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, మరోపక్క ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారని తెలిపారు. నూతనంగా ఎన్నికైన త్రీమెన్ కమిటీ సభ్యులందరూ సొసైటీ యొక్క స్థితి గతులను తెలుసుకోవాలని, సొసైటీ ద్వారా రైతులకు అందించే ఎరువుల అమ్మకాలు, నిత్యవసర వస్తువులు అమ్మకాలు, దీర్ఘకాలిక రుణాలు, తదితర అంశాలపై దిశా దశ నిర్దేశించారు. ఈనెల 22వ తేదీన వేమగిరి, కడియం, మురమండ, కడియపులంక సొసైటీలకు, 23వ తేదీన హుకుంపేట, రాజవోలు సొసైటీలకు, 24వ తేదీన కోలమూరు, కాతేరు, తొర్రేడు సొసైటీలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్య ప్రసాద్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్స్సేటి ప్రసాద్, నున్న కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కురుకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


