Battula : సత్తెమ్మ తల్లి అమ్మవారి దేవాలయ శంఖుస్థాపనలో పాల్గొన్న బత్తుల

TRINETHRAM NEWS

Trinethram News : రాజానగరం మండలం, జి -యర్రంపాలెం గ్రామంలో వెల్ల వారి సత్తెమ్మ తల్లి అమ్మవారి దేవాలయ శంఖుస్థాపన కార్యక్రమానికి ఆలయ కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకట లక్ష్మి, విచ్చేసి కొబ్బరికాయ కొట్టి సత్తెమ్మ తల్లి అమ్మవారి దేవాలయమునకు శంఖుస్థాపన చేశారు. ఈ శుభ కార్యక్రమం వెంకటలక్ష్మి, చేతుల మీదుగా వేదమంత్రాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. వెంకటలక్ష్మి, పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి, సత్తెమ్మతల్లి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజల యందు మాత్రమే కాకుండా రాజానగరం నియోజకవర్గం మొత్తంగా ఉండాలని సత్తెమ్మతల్లి అమ్మవారికి వేడుకున్నారు. అనంతరం బత్తుల వెంకటలక్ష్మి, ని ఆలయ కమిటీ వారు శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Battula who participated

You cannot copy content of this page

Scroll to Top