మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, విజయవాడ రూరల్, 7.11.2025. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన ఆర్థిక సాయాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శుక్రవారం చెక్కులు, ఎల్.ఓ.సీల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని 32 మందికి రూ.29,90 లక్షల రీ ఎంబర్స్ మెంట్ చెక్కులు, 23 మందికి రూ.41.10 లక్షలు ఎల్.ఓ.సిల రూపంలో ఆర్థికసాయం తాజాగా మంజూరైంది.
మైలవరం, గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయాల్లో, (ఎల్.ఓ.సి)లను, చెక్కులను సీఎం చంద్రబాబు నాయుడు సందేశ పత్రాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నుంచి సత్వరం ఆర్థికసాయం అందుతుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


