MLA Vasantha Krishna Prasad : ప్రజాదర్బారుకు అనుహ్యస్పందన

TRINETHRAM NEWS

పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

నాలుగు గంటలకు పైగా నిర్విరామంగా కొనసాగిన వినతుల స్వీకరణ.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 07.11.2025. ప్రజాసమస్యల పరిష్కార వేదికగా నిర్వహించిన ‘ప్రజాదర్బారు’కు అనుహ్యస్పందన లభించింది. మైలవరం పట్టణంలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బారులో స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. నాలుగు గంటలకు పైగా నిర్విరామంగా వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓపికగా విని వారి సమస్యల పరిష్కారం కోసం ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ

ప్రజాదర్బార్‌ వేదికలో అన్నిశాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఇక్కడకు వచ్చే సమస్యలను నెల రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. ప్రజా సమస్యలకు మొక్కుబడిగా కాకుండా నాణ్యతతో కూడిన పరిష్కారం లభించాలని అన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ బాధ్యతతో పని చేయాలన్నారు. సమస్యల మూలాలను గుర్తించి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెడుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ గారు, మంత్రి నారా లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు.

శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బారులో పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, విద్యుత్తు, రహదారుల అభివృద్ధి, వివిధ శాఖలకు సంభందించిన సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలపై ప్రజలు ఆర్జీలు సమర్పించారు. వాటిలో సమస్య తీవ్రతను బట్టి వెంటనే పరిష్కరించే అవకాశం ఉన్నవాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

నిధుల మంజూరుతో ముడిపడిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. మరికొన్ని సమస్యలపై సమగ్రంగా విచారించి తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే ఇళ్లస్థలాల మంజూరు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A warm response to the public forum

You cannot copy content of this page

Scroll to Top