MLA Vasantha Krishna Prasad : గొల్లపూడిలో ఘనంగా ఆచార్య ఎన్.జి.రంగా జయంతి

TRINETHRAM NEWS

నివాళులర్పించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి, 07.11.2025. ప్రపంచ రైతాంగ ఉద్యమనేత, ఆచార్య ఎన్.జి రంగా జయంతిని విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.జి రంగా విగ్రహానికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆచార్య ఎన్.జి రంగా చేసిన సేవలను వివరించారు. భారత స్వాతంత్ర్య సమరయోధునిగా, జాతీయ వాదిగా, పార్లమెంటు సభ్యునిగా, రైతు నాయకునిగా రంగా విశేష సేవలు అందించేందుకు కృషి చేశారని అన్నారు.

విలక్షణమైన రైతు ఉద్యమాలను సాగించి 1936లో భారతీయ కిసాన్ సభను స్థాపించారన్నారు. రైతుల క్షేమానికి ప్రత్యేక ఉద్యమాలు చేశారన్నారు. 1933లో రైతు కూలీల ఉద్యమానికి నేతృత్వం వహించారు.రైతు కుటుంబాల అభివృద్ధికి, భూ సమస్యలపై ఎన్.జి.రంగా దేశవ్యాప్తంగా చైతన్యం తెచ్చారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఆయన సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Acharya N.G. Ranga's birth anniversary

You cannot copy content of this page

Scroll to Top