తేదీ : 20/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, పట్టణం శ్రీనివాస సెంటర్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సంబంధిత లబ్ధిదారులకు శాసనసభ్యులు, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు. పార్థసారథి నూట ఇరవై మందికి రూపాయల కోటి విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ప్రతి విషయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుంది, ముఖ్యంగా అనారోగ్యం, ప్రమాదాలు, ఆకస్మిక అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో అందించే ఆర్థిక సాయం ఎన్నో కుటుంబాలకు ఊరటను కలిగిస్తోంది అని అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పట్ల కట్టుబడి ప్రతి ఒక్కరికి సహాయం అందించడానికి కృషి చేస్తోంది అని అన్నారు. ఇప్పటికె వేలాది కుటుంబాలు లబ్ధి పొందాయి అని తెలిపారు. ఎవరు కష్టాల్లో ఒంటరై పోకుండా చూడడం ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మును పెన్నడూ లేనివిధంగా ఈ నియోజకవర్గంలో గౌడ సోదరులకు నూట నాలుగు మంది కల్లుగీత కార్మికులకు నూతన ఐడి కార్డులను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ఈ కార్డుల ద్వారా కల్లుగీత కార్మికులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతారని, ఆరోగ్య రక్షణ, విద్యా సహాయం, పింఛన్ల వంటి అనేక సదుపాయాలు ఈ కార్డు తో లభిస్తాయి అని సూచించారు. గౌడ సోదరుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడు కట్టుబడి ఉంది అని చెప్పారు. మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నానని. హామీ ఇచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


