TRINETHRAM NEWS

నేడు జైపూర్ కు సీఎం రేవంత్

Trinethram News : Dec 11, 2024,

తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాజస్థాన్ లోని జైపూర్ కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే బంధువుల వివాహానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం సీఎం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హస్తినలో రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలను ఆయన కలుస్తారని సమాచారం. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించనున్నారు. సీఎం తిరిగి గురువారం హైదరాబాద్ చేరుకుంటారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App