TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌ :మార్చి 30
రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.

ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యు త్తును అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు.

డిమాండ్ కు సరిపడేంత విద్యుత్తు అందుబాటులో ఉందని, కరెంటు పోయింద నే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎక్కడైనా సమ స్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని సూచిం చారు.

రోజురోజుకు ఎండలు మండుతుండటం విద్యుత్తు డిమాండ్ పెరుగుతుండ టంతో రాష్ట్రంలో అందుబా టులో ఉన్న విద్యుత్తు లభ్య త, తక్షణ అవసరాలపై ఆదేశాలిచ్చారు.

గత ఏడాది కంటే రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్తును సరఫరా చేయటం కొత్త రికార్డును నమోదు చేసిందని అన్నారు