జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 21 at 3.21.24 PM

TRINETHRAM NEWS

పల్నాడు ప్రజలను మోసం చేసిన సీఎం జగన్ : టిడిపి నేతలు

మాచర్ల నియోజకవర్గంలోని వరికపూడిశెల ప్రాజెక్టుకు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి 68 రోజులు అయినా ఇప్పటికీ నిధులు కేటాయించకుండా ఒక్క ఇటుక కూడా వేయకుండా ప్రజలను దగా చేసి మోసం చేశాడని టిడిపి నేతలు వ్యాఖ్యానించారు…

పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారు, మాచర్ల నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు వరికపూడిసెల ప్రాజెక్టు వద్ద నిరసన తెలియజేశారు. జగన్ రెడ్డి మాయమాటలు చెప్పి వరికపూడిశెల వద్ద హడావుడి చేసి చివరకు ప్రజలను నట్టేట ముంచాడని తెలిపారు. పల్నాడు ప్రజలను మోసం చేసిన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

కార్యక్రమంలో భారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page