డిండి (గుండ్ల పల్లి) జనవరి 29 త్రినేత్రం న్యూస్.. డిండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు గురువారం రోజు సీ ఎం కప్ టోర్నమెంటును తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ క్రీడలలో వివిధ పాఠశాల ల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డిండి ఎస్ఐ బాలకృష్ణ , ఎం ఈ ఓ గొప్య నాయక్ , జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతయ్య , మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సి నారాయణ రెడ్డి , పంచాయతీ సెక్రెటరీ చిరంజీవి, సర్పంచ్ నల్లగంతుల రవి , ఉప సర్పంచ్ కౌసర్ రషీద్, మండలంలోనివివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


