Cluster System Abolished : క్లస్టర్ వ్యవస్థ రద్దు – పంచాయతీలకు స్వతంత్ర హోదా!

TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది! ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి, 19,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రకటించింది.

ముఖ్య నిర్ణయాలు:
పంచాయతీలను 4 గ్రేడులుగా విభజించారు
పంచాయతీ కార్యదర్శుల పేరును “పంచాయతీ అభివృద్ధి అధికారి (PDO)”గా మార్చారు
ప్రతి పంచాయతీలో ఇప్పుడు ఉండబోయే విభాగాలు
 - పారిశుద్ధ్యం
 - తాగునీటి సరఫరా
 - గ్రామీణ ప్రణాళిక
 - వీధి దీపాలు
 - ఇంజినీరింగ్
 - ఆదాయం & పన్ను వసూళ్లు

సిబ్బంది మార్పులు:
రూర్బన్ పంచాయతీల్లో జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లను సీనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తారు
డిజిటల్ అసిస్టెంట్లతో ప్రత్యేక IT విభాగం ఏర్పాటు
కార్యదర్శుల ఖాళీలను 2025-26 ప్యానెల్‌కు ముందే భర్తీ చేయాలని నిర్ణయం

ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జారీ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cluster system abolished

You cannot copy content of this page

Scroll to Top