రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా గురువారం గోదావరి నది పుష్కరఘాట్ వద్ద నిర్వహించిన “ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్: నేషన్‌వైడ్ వాలంటరీ శ్రమధాన్” కార్యక్రమంలో నగర పాలక సంస్థ సిబ్బంది , మెప్మా సిబ్బంది పాల్గొని సమగ్ర పరిశుభ్రత డ్రైవ్ చేపట్టి ఒడ్డున ఉన్న ప్లాస్టిక్ , చెత్త ఏరి వేశారు. ఈ సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ , పరిశుభ్రతా క్రమ శిక్షణ సంస్కృతిని ప్రోత్సహించడానికి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఒక మైలు రాయి అని అన్నారు. ఈ కార్యక్రమం సమిష్టి కృషి శక్తి ని నిరూపించిందని అన్నారు. నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు , సెక్రెటరీ ఉమా మహేశ్వర్ రావు , ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ , ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ , మెప్మా సి ఓ లు ఊర్మిళ , శ్వేత . ప్రియ దర్శిని , వార్డు అధికారులు , సానిటరీ జవాన్లు , ఎకో వారియర్స్ ప్రతినిధులు శివ కృష్ణ , కరుణా కర్ , మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


