TRINETHRAM NEWS

కార్మికుల అనుమతి లేకుండా టెంపుల్ కోడుతో రికవరీ చేసిన 500/- రూపాయలను కార్మికులకు తిరిగి చెల్లించండి సీఐటీయు

కార్మికుల అనుమతి లేకుండా రికవరీ చేయటం పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 ప్రకారం నేరం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) Rg1 బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్,

సింగరేణిలో గుడి పేరుతో చందాల దంద మొదలైందని, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆర్జీవన్ బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్ ఆరోపించారు, సింగరేణి కార్మికులు దసరా దీపావళి సందర్భంగా అన్ని కార్మిక సంఘాలకు స్వచ్ఛందంగా సహకరించి బ్యాంకు ఆర్థరేషన్స్ పై సంతకాలు చేసి అందించిన విషయం కార్మికులందరికీ తెలుని, అక్టోబర్ నెల కార్మికుల జీతం చిట్టిలో 1840 కోడ్ తో టెంపుల్ చందాల పేరుతో 4417 మంది కార్మికుల వద్ద నుండి 500 రూపాయలు 22 లక్షల 8500 రూపాయలు యాజమాన్యం రికవరీ చేసిందని, మా అనుమతి లేకుండా గుడి కమిటీలో తీర్మానం చేయకుండా ఎలా రికవరీ చేస్తారని ఆందోళన చెందుతున్నారు, సంబంధిత అధికారులను నిలదీస్తున్నారు వ్యక్తిగతంగా లెటర్ల ద్వారా మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి ఉంది, పారిశ్రామిక సంబంధాలు దెబ్బతినే విధంగా కార్మికుల అనుమతి లేకుండా యజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రికవరీ చేయడం పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు 1936 ప్రకారం చట్టరీత్యా నేరం, ఇలాంటి తప్పుడు విధానాల వలన సింగరేణి ప్రతిష్ట దెబ్బతినడం కాకుండా పారిశ్రామిక అశాంతి నెలకొంటుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ గా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కార్మికుల అనుమతి లేని రికవరీలను రద్దు చేసి తిరిగి చెల్లించాలని కోరుతున్నాం,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App